2023 సంక్రాంతికి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి బడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో 4 సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తునీవు జనవరి 11న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇందులో అజిత్ కుమార్, మంజు వారియర్ నటించారు. సముద్రఖని, మమతీ చారి, సిబి భువన చంద్రన్ సహాయక పాత్రల్లో నటించారు. ఇక జనవరి 12న బాలకృష్ణ హీరోగా తెలుగు యాక్షన్ డ్రామా ‘వీర సహా రెడ్డి’ రిలీజ్ కానుంది. ఈ మూవీలో దునియా విజయ్‌తో పాటు లాల్, శృతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ యాక్ట్ చేశారు.
జనవరి 12నే రూ.200 కోట్ల బడ్జెట్ తో తమిళ్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన వారిసు లేదా వారసుడు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ తర్వాత జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకులను పలకరించింది. ఈ 4 మూవీలు బాగా ఎంటర్టైన్ చేస్తాయని ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ మూవీ యూనిట్స్ ప్రమోషన్ లను స్టార్ట్ చేసేసాయి. మూవీల నుంచి అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ మరింత హైప్ పెంచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ నాలుగు భారీ సినిమాలు అమెరికాలో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల యూఎస్ఏ బుకింగ్ లను మూవీ యూనిట్స్ ఓపెన్ చేశాయి. సో ఈ సంక్రాంతికి అమెరికాలో నివసించేవారు ఈ నాలుగు సినిమాలను ఎంచక్కా చూసేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు.