సైలెంట్ గా ఉండే శేఖర్..ఆ విషయంలో హీరోయిన్స్ ని అంత టార్చర్ చేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది . కొందరికి రొమాంటిక్ సాంగ్స్ పిచ్చి , మరికొందరికి యాక్షన్ సీన్స్ పిచ్చి, కొందరికి ఫ్యామిలీ సెంటిమెంట్స్ పిచ్చి , కొందరికి హీరోయిన్స్ పిచ్చి .. ఇలా అన్ని పిచ్చులు కలిస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది అంటూ కూడా కౌంటర్స్ వేస్తూ ఉంటారు కొందరు జనాలు. అయితే పైకి చూడడానికి చాలా సైలెంట్ గా ..డీసెంట్ బాయ్ అనిపించే విధంగా ఉండే డైరెక్టర్ కూడా హీరోయిన్స్స్ ని టార్చర్ చేశాడు అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

 

ఫీల్ గుడ్ ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ఎంత చెప్పినా తక్కువే.. వల్గర్ సీన్స్ కి దూరంగా ..ఫ్యామిలీ సీన్స్ కి దగ్గరగా ఉండే ఆయన డైరెక్షన్ చాలా మంది లేడీస్ ఇష్టపడుతూ ఉంటారు . అంతేకాదు ఆయన తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే జనాలకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ..కానీ కాలనీలో ఉండే జనాలకు మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది . హ్యాపీ డేస్ సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే .

అంతకుముందు ఆనంద్ సినిమాతో సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు శేఖర్ కమ్ముల . కాగా ఇలా శేఖర్ కమ్ముల తన సినిమాలు నటించే హీరోయిన్స్ ని సింప్లిసిటీ విషయంలో బాగా రుద్దేస్తాడని ..సినిమాలో నేచురల్ లుక్స్ కోసం హీరోయిన్స్ ను చాలా టార్చర్ చేస్తాడని ..మేకప్ లేకుండా తాను కోరిన విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేలాగా ఫోర్స్ చేస్తాడు అన్న న్యూస్ ఎక్కువగా వినిపిస్తుంది .

అంతేకాదు గతంలో కమలని ముఖర్జీ ..ఆ తరువాత తమన్నా ..ఆ తరువాత సాయి పల్లవి ఇలా వరుసగా స్టార్ హీరోయిన్స్ ను ఆయన నాచురల్ లుక్స్ విషయంలో టార్చర్ చేశాడు అంటూ సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. శేఖర్ కమ్ముల అంత కష్టపడితేనే సినిమా ఇంత హిట్ అయిందా అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. త్వరలోనే శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నీ హీరోగా పెట్టి బిగ్గెస్ట్ సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు.