మహేష్ బాబు తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి భారీ ప్లాన్స్..

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2022లో దాదాపు ఫారిన్‌లోనే తన సమయాన్ని గడిపేశాడు. ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఈ హీరో విదేశాల్లోనే ఎంజాయ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పరదేశంలోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ హ్యాండ్సమ్ హీరో స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతను తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి లుజర్న్‌ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నాడట.

ఈ విషయం ఎలా తెలిసిందంటే తాజాగా మహేష్ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో తన పిక్ షేర్ చేసింది. ఆ ఫొటో పోస్ట్‌లో లొకేషన్‌ను లుజర్న్‌, స్విట్జర్లాండ్‌గా సెలెక్ట్ చేసింది. అంటే ఈ ముద్దుగుమ్మ తన భర్త, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉందని క్లియర్‌గా తెలుస్తోంది. ఇటీవల మహేష్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫ్యామిలీ ఫోటో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో తాను లూజర్న్ లోని మాండరిన్ ఓరియంటల్ పాలస్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. అక్కడ క్రిస్మస్ పండుగ కూడా జరుపుకున్న వెల్లడించాడు. చూస్తుంటే మహేష్ ఈ కొత్త సంవత్సరాన్ని చాలా హ్యాపీగా తన జీవితంలోకి ఆహ్వానించొచ్చని తెలుస్తోంది.

గత వారం, మహేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించాడు. కొత్త సంవత్సరం వేడుకల తర్వాత, మహేష్ తన మూవీ కమిట్‌మెంట్‌లపై దృష్టి పెట్టడానికి తిరిగి హైదరాబాద్‌కు వస్తాడు. ఈ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన SSMB 28 సినిమా కోసం నెలాఖరులో షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమాలో అతని సరసన నటి పూజా హెగ్డే నటిస్తోంది.