బాలయ్య మీద నమ్మకంతోనే మైత్రి మూవీ అన్ని కోట్లు ఈ సినిమా నిర్మించిందా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఏ స్థాయిలో జరుగుతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు స్వయంగా డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

nbk 107 movie title, Nandamuri Balakrishna 'వీర సింహా రెడ్డి' టైటిల్ వెనుక  ఇంత కథ ఉందా? - nandamuri balakrishna rejects jai balayya title: reports -  Samayam Teluguఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ చిత్రాలను వరుసగా నిర్మిస్తున్నారు మైత్రి మూవీస్ వారు అందులో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోతున్నాయి.మరి వీరసింహారెడ్డి ఫలితం ఎలా ఉంటుందని సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. బాలయ్య కెరియర్ లోని ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దీంతో కొంతమంది మైత్రి మూవీస్ వారు అంత బడ్జెట్ పెట్టడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది బాలయ్య ఈ సినిమా సక్సెస్ అయితే తన రేంజ్ మారిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మరి మైత్రి మూవీస్ వారు వీరసింహారెడ్డి సినిమాకు 150 కోట్ల రూపాయలను పెట్టడం తప్పేం కాదంటూ మరి కొంతమంది తెలియజేస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో సింగిల్ గా దిగి తన సత్తా చాటి విమర్శకుల నుండి ప్రశంసలు బాలయ్య అందుకుంటారేమో చూడాలి మరి. ఏది ఏమైనా బాలకృష్ణ ఈ సినిమాతో సక్సెస్ అవుతారని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.