మంచు కుటుంబంలో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ముఖ్యంగా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ,మంచు మనోజ్ కూడా ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక అప్పుడప్పుడు ఈ కుటుంబం మీద ఎన్నోసార్లు కొంతమంది కావాలని ట్రోల్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఈ లిస్టులో మంచు మనోజ్ కూడా చేరారు.అందుకు కారణం కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నా మనోజ్ ప్రముఖ పొలిటిషన్ భూమ నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి తో ఎన్నోసార్లు బయట కనిపించారు.దీంతో ఆమెతో డేటింగ్ ఉన్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తుండడంతోపాటు మంచు ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.

నిఖిల్ తో నాటకాలంటూ మంచు లక్ష్మి వీడియో.. తన ఫస్ట్ లవ్ ప్రభాస్ అంటూ రచ్చ |  video-of-manchu-lakshmi-pretending-to-play-with-nikhil-racha-saying-her-first-love-prabhas  Video , Manchu Lakshmi ...
ఈ క్రమంలోనూ తమ ఫ్యామిలీలో విభేదాలు జరిగి ఒకరినొకరు దూరంగా ఉంటున్నామనే వినిపిస్తున్న రూమర్ల పైన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి స్పందించడం జరిగింది. మంచు లక్ష్మీ మాట్లాడుతూ మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలని మా పర్సనల్ ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా కలిసే ఉన్నాం కాకపోతే ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నాము.. విష్ణు కి ఫ్యామిలీ, పిల్లలు, బిజినెస్ వాటిపైనే ఎక్కువ సమయం సరిపోతుంది. ఇక తనకు మనోజ్ కు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటామని అందుచేతను ఎక్కడైనా మేమిద్దరమే ఎక్కువగా కనిపిస్తామని తెలియజేస్తోంది మంచు విష్ణు.

అయితే ఈ విషయాలు విన్నప్పటికీ అభిమానులకు ప్రేక్షకులకు మాత్రం వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలకు మరింత బలం చేకూరినట్లుగా అయ్యిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈమధ్య కాలంలో మంచు ఫ్యామిలీ నుంచి విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి దీంతో వీరు తెరకెక్కించే సినిమాల పైన ట్రోల్స్ వినిపిస్తూ ఉన్నాయి.