ప్ర‌భాస్ నా ఫ‌స్ట్ లవ్‌.. ఓపెన్‌గా సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన మంచు ల‌క్ష్మి!

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత దొంగల ముఠా, గుండెల్లో గోదారి తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసింది.

కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. నాటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. రీసెంట్గా మాన్‌స్టార్‌ మూవీ తో మలయాళం లోకి ఎంట్రీ ఇచ్చింది. మోహన్ లాల్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి బోల్డ్‌ గా నటించి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా మంచు ల‌క్ష్మి ప్ర‌భాస్ నా ఫ‌స్ట్ ల‌వ్ అంటూ ఓపెన్ గానే సీక్రెట్ ను బ‌య‌ట‌పెట్టింది. మంచు లక్ష్మిని ప్రముఖ యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి నుంచి నిఖిల్‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రాబట్టినట్టు ప్రోమో బట్టి అర్థమవుతుంది. అలాగే నిఖిల్.. ప్రభాస్, విజయ్ దేవరకొండ పేర్లు చెప్పి ఈ ఇద్దరిలో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించాడు. అందుకు మంచు లక్ష్మి టక్కున ప్రభాస్ పేరు చెప్పింది. అంతే కాదు ప్రభాస్ తన ఫస్ట్ లవ్ అని, మంచి మనసున్న వ్యక్తిని చెప్పుకొచ్చింది. దీంతో మంచు ల‌క్ష్మి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.