అలనాటి తెలుగు హీరోయిన్స్ సావిత్రి నుండి జయసుధ, విజయశాంతి వరకు ఎంత సంప్రదాయతను మెంటైన్ చేసేవారో మీకు తెలియంది కాదు. కానీ నేడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. దాంతో వెండితెరపైన అవకాశాలకోసం నేటి సినిమా యాక్ట్రెస్ హద్దులు దాటి ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా ఇపుడు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందడంతో హాట్ హాట్ ఫోటో షూట్స్ ఎక్కువైపోయాయి. అది కూడా ఓ బోర్డర్ వరకు పర్వాలేదు గాని… ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ హద్దులు చెరిపేసి రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మొదలుకొని టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక వరకు కాస్త దిగజారి ఫోటోషూట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వీరు ఇరువురు జీన్స్ ప్యాంట్ జిప్ తీసేసి కనిపించిన విధానం సోషల్ మీడియాలో పెను తుఫాను సృష్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోలో ప్రియాంక, ఎల్లో డ్రెస్ బ్లూ జీన్ లో ప్రగ్యా రెచ్చిపోయి ఫోటోలు దిగారు. ఎలాంటి గ్లామరస్ పాత్రలు అయినా సరే చేయడానికి సిద్ధమే అనే దానికి ఈ ఫోటోలు చిహ్నాలుగా కనబడుతున్నాయి కాబట్టి నిర్మాతలు వీరిమీద ఓ కన్నేయాల్సిన పరిస్థితి ఎంతైనా వుంది.
మొదట్లో టాక్సీవాలా అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ప్రియాంకకు తరువాత అనుకున్నంత స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు. అదేమాదిరి ప్రగ్యాకి కూడా తన మొదటి సినిమా కంచె తరువాత అనుకున్నంత స్థాయిలో మంచి సినిమాలు పడలేదు. చాలా గ్యాప్ తరువాత మన బాలయ్య సినిమా ద్వారా మరలా హిట్ కొట్టింది. ఆ తర్వాత కూడా ఆమెకి మంచి సబ్జక్ట్స్ రాలేదు. దాంతో వీరు ఒకేతాటిపైకి వచ్చినట్టు వున్నారు. ఇకనైనా వారిని మంచి మంచి కధలు వారించాలని కోరుకుందాం.