ప‌దేళ్ల తర్వాత ఆ ప‌ని చేసినా న‌య‌న‌తార‌ క‌ష్టానికి ఫ‌లితం ద‌క్క‌లేదు!?

వివాహం అనంతరం లేడీ సూపర్ స్టార్ నయనతార నుంచి వచ్చిన తొలి చిత్రం `కనెక్ట్`. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ నిర్మించాడు. హారర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 22న తెలుగు తమిళ భాషల్లో విడుదల అయింది.

యూవీ క్రియేషన్స్ వారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు. గత కొంతకాలం నుంచి నయనతార సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్స్ కు రానని ముందే చెప్పేస్తుంది. కానీ కనెక్ట్ విషయంలో అలా జరగలేదు. నయన్ తమిళం తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ప్రమోట్‌ చేసింది.

 

దాదాపు ప‌దేళ్ల తర్వాత ఈ అమ్మడు కనెక్ట్ సినిమా కోసం ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంది. అయినా సరే ఆమె కష్టానికి ఫలితం దక్కలేదు. కనెక్ట్ కథ‌ రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లే అయినా ఆకట్టుకుంటుందని భావించారు. కానీ స్క్రీన్ ప్లే మరింత రొటీన్ గా ఉండడంతో కనెక్ట్ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వ‌సూళ్ల‌ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.