మన హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలిస్తే ..ఆశ్చర్య పోవాల్సిందే..!

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆత్రుతగా ఉంటుంది. వారికి సంబంధించిన‌ వ్యక్తిగత విషయాలు గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో ఆ వార్త వైరల్ గా మారిపోతుంది. అలాంటి సినిమా హీరోలు ఎంతవరకు చదువుకున్నారు వారు ఎక్కడ డిగ్రీ పొందారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

Tollywood Heroes and Their Educational Qualifications | Latest | News |  Videos | TOP Telugu TV - YouTube

నందమూరి కళ్యాణ్ రామ్:
కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు. తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ చేశారు .

అవసరాల శ్రీనివాస్:

న‌టుడు క‌మ్ ద‌ర్శ‌కుడు అయ‌న అవసరాల శ్రీనివాస్ అమెరికా లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసాడు.

వెంకటేష్:
సినిమ‌ర్ హీరో వెంకటేష్ హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసి త‌ర్వాత‌ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు.

Latest Remuneration list of Telugu Heroes

అక్కినేని నాగార్జున:
నాగార్జున చెన్నై లో ఇంజనీరింగ్ చేసి , ఆ త‌ర్వాత అమెరికా లో ఆటోమొబైల్ ఇంజినీర్ లో మాస్టర్స్ చేశారు.

సాయి ధరమ్ తేజ్:
ఈ మెగా మెన అల్లుడు సాయి ధరమ్ తేజ్ బయో టెక్నాలోజి లో ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (IIPM) ఎం.బి.ఏ ని పూర్తి చేసాడు.

రాజ శేఖర్:
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఎంబిబిఎస్ చేసి కొంతకాలం డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి తర్వాత చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టాడు.

రామ్ చరణ్:
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

Telugu Hero

అల్లు అర్జున్:
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ వారసుడిగా సినిమాలలోకి ఎంటర్ ఇచ్చిన అల్లుు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్‌:
నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం వారసుడుగా టాలీవుడ్లో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సెయింట్ మేరీస్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ పాసయ్యాడు.