SSMB లో శ్రీ లీల ఉందా.. లేదా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్ర SSMB -28 ఈ సినిమా షూటింగ్ మొదల ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమా స్టోరీలో కూడా పలుమార్పులు చేసి సరికొత్త కథ అంశంతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 12 ఏళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ ,మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. దీంతో మహేష్ అభిమానులు కూడా సినిమాను చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు.

మహేష్ SSMB28లో ఆ యంగ్ బ్యూటీ.. అమ్మడి కోరిక తీరినట్టేనా | మహేష్  SSMB28#8217;లో ఆ యంగ్ బ్యూటీ.. అమ్మడి కోరిక తీరినట్టేనా - Mahesh Babu,  Pooja Hegde, Sarkaruvaari, Sreeleela ...

ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు కీలకమైన నటీనటులను ఎంపిక పూర్తి చేశారు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం క్రేజీ నటులను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హీరోయిన్గా పూజ హెగ్డే ఫైనల్ చేయగా ఈ చిత్రంలోని కీలకమైన పాత్ర కోసం బోమన్ ఇరానీ, టబు, సచిన్ ఖేడేకర్ ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా పెళ్లి సందD హీరోయిన్ శ్రీదేవి నటించబోతోంది అంటే గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

నిన్నటి రోజున ఆమె నటించిన ధమాకా చిత్రం విడుదల కాగా మళ్లీ ఈ విషయం వైరల్ గా మారు తోంది. ధమాకా సినిమా ప్రమోషన్లలో తన ప్రాజెక్టుల గురించి తెలియజేస్తూ బాలయ్య ,అనిల్ రావిపూడి సినిమాతో తను బాలయ్య కూతురుగా నటిస్తున్నానని స్పష్టం చేసింది.అలాగే రామ్ ,పోతినేని బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా చేస్తున్నట్లు తెలిపింది. అలాగే నితిన్ ,ఒక్కంతం వంశీ సినిమాలకు కూడా నటిస్తున్నట్లు తెలిపింది. కానీ SSMB -28 చిత్రం గురించి ఏ ఒక్క మాట కూడా తెలపలేదు. దీంతో ఏమి ఈ చిత్రంలో ఉన్నట్టా..లేనట్టా అనే విధంగా కామెంట్లో వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై త్రివిక్రమ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.