సంక్రాంతి వేటకు సింహం రెడీ.. బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వీడియో..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం అఖండతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ అన్ స్టాపబుల్ షో తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ కూడా వచ్చే సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ అభిమానుల్లో రచ్చ లేపుతున్నాయి.

Veera Simha Reddy: 'వీరసింహారెడ్డి' గా బాలయ్య.. మాస్ లుక్ లో అరాచకం - NTV Telugu

వాటితో పాటు మాస్ ఆంథమ్ గా వచ్చిన ‘జై బాలయ్య’ పాట రీసెంట్ గా వచ్చిన ‘సుగుణసుందరి’ పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు సంక్రాంతికి బాలయ్యకు ఉన్న అభినాభావ సంబంధం గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు.. అందులోనూ సింహ అనే పదంతో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన హిస్టరీ బాలయ్యకు ఉంది.

Balakrishna Veera Simha Reddy Shooting Completed - Telugu Rajyam

రాబోయే సంక్రాంతికి బాలయ్య+ సంక్రాంతి కలిసి వస్తే బాక్సాఫీస్ బరిలో తుఫాను అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక వీడియోలో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహ’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’ సినిమాలు సంక్రాంతి కానుకగా వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. ఆ సంగతులను గుర్తు చేస్తూ క్రియేట్ చేసిన వీడియో చూస్తుంటే బాలయ్య అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటూ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కి ‘రికార్డుల ఊచ కోత మొదలవనుంది. ఇక ట్రైలర్ కోసం వేటింగ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. వీర సింహారెడ్డి వచ్చేస్తున్నాడు’.. అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో బాలయ్య అభిమానులను ఎంతగానో ఖుషి చేస్తుంది. బాలయ్యకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్ రాబోయే సంక్రాంతి కూడా బాలయ్యకు అఖండను మించి అదిరిపోయే హిట్ ఇస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

NBK107: First look of Nandamuri Balakrishna unveiled; netizens wonder whether it's a remake of Kannada film Mufti

ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుండగా ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ స్టార్ హీరో ‘దునియా’ విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాల్లో ఒక పాటినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో బిజీ అవ్వాలని బాలయ్య చూస్తున్నాడు.