లక్కి బ్యూటీని లైన్లో పెట్టిన కొరటాల.. ఎన్టీఆర్ కోరిక తీరిపోయిన్నట్లేగా..!?

“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ.. రావడం అయితే పక్కా “ఇదే డైలాగ్ ను ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మనకు తెలిసిందే నిన్న మొన్నటి వరకు ఖాతాలో ఒక్క ఫ్లాప్ లేని ఈ డైరెక్టర్ ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు మొత్తం గంగలో కలిసిపోయింది . మరీ ముఖ్యంగా మెగాస్టార్ లాంటి ఓ లెజెండ్ హీరో.. రామ్ చరణ్ లాంటి ఓ యంగ్ హీరోతో సినిమా తీసి కూడా ఫ్లాప్ ని తెచ్చుకోవడం కొరటాల కెరియర్ కె డిజాస్టర్ గా మారింది .

ఈ క్రమంలో నే ఎన్టీఆర్ తో సినిమాని ప్రకటించారే కానీ ఇప్పటివరకు దాని గురించి ఒక్క అప్డేట్ ఇవ్వలేదు . కాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని షూటింగ్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నా.. దానికి ఎగ్జాక్ట్గా ముహూర్తం అంటూ ఏది చెప్పలేకపోతున్నారు .అయితే ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ 30 లో రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అయితే ఇదే క్రమంలో సినిమాలో కీలకపాత్రలో నటించబోతుంది కొరటాల లక్కీ హీరోయిన్ నిత్యమీనన్ అంటూ సోషల్ మీడియాలో మరో వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతేకాదు ఆల్రెడీ జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో జత కట్టిన నిత్యామీనన్ పై తారక్ ఓ రేంజ్ లో పొగిడేసారు తనకు అవకాశం వస్తే మరొకసారి నిత్యామీనన్ తో నటించాలనుకుంటున్నానని గతంలో చెప్పుకొచ్చారు . ప్రజెంట్ ఆ కోరికనే కొరటాల తీర్చబోతున్నట్లు తెలుస్తుంది . సినిమాలో కీలక పాత్ర కోసం నిత్యామీనన్ ని అప్రోచ్ అయ్యారట కొరటాల ..ఎన్టీఆర్ తో సినిమా అనేసరికి నిత్యామీనన్ కూడా యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ తన కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తుంది. సినిమాలో హీరోయిన్గా లేకపోయినా పర్లేదు గాని కంటెంట్ లో తాను కచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ లో ఉండాల్సిందే అంటూ కండిషన్ పెడుతుంది . ఈ వార్త విన్న కొరటాల ఆమెకు అదిరిపోయి ఆఫర్ ఇచ్చినట్లు సినివర్గాలలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. చూడాలి మరి ఈసారి ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో ఈ మలయాళీ ముద్దుగుమ్మ..?

Share post:

Latest