ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు స్టార్ ప్రేమికులుగా ట్యాగ్ వేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోయిన్ త్రిష మళ్లీ కలవబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . మనకు తెలిసిందే వర్షం సినిమాతో మొదటిసారి తెరపై కలిసిన నటించిన ఈ జంట ఫస్ట్ సినిమాతోనే సూపర్ కెమిస్ట్రీ అంటూ మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత వీరి జంటకు క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే త్రిష- ప్రభాస్ కలిసి రెండు సార్లు స్క్రీన్స్ షేర్ చేసుకున్నారు .బుజ్జిగాడు , పౌర్ణమి సినిమాలో నటించి తమ కెమిస్ట్రీని మరింతగా జనాలు చేత అట్రాక్ట్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ -త్రిష ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న న్యూస్ లో అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి త్రిష ..రానాను ప్రేమిస్తుందని తెలియడంతో వాళ్ల ప్రేమ అక్కడే పెటాకులు అయిపోయింది. కాగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రభాస్ సినిమాలో త్రిష నటించబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .
మనకు తెలిసిందే మారుతి డైరెక్షన్ ప్రభాస్ ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు . ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది . కాగా ఇప్పటికే ఈ సినిమాల్లో ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ రొమాన్స్ చేస్తున్నట్లు క్రేజీ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో త్రిష కూడా యాడ్ అవ్వబోతుంది అంటూ ఒక క్రేజీ రూమర్ వైరల్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాల్లో త్రిష గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం ఐదు నిమిషాల పాత్ర నే అని.. కానీ సినిమాలో కీలక పాత్రగా ఈమె రోల్ ఉండబోతుంది అంటూ తెలుస్తుంది . ఆ విధంగా మారుతి డిజైన్ చేశారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే పాత ప్రేమికులు మళ్లీ కలిసి నటించి కొత్తగా తమ ప్రేమను చిగురించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు . చూద్దాం మరి ప్రభాస్ తన పాత గర్ల్ ఫ్రెండ్ తో కొత్త గా ఎలా రోమాన్స్ చేస్తాడో..?