ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్బాస్ 6 గురించే చర్చలు నడుస్తున్నాయి. ముగింపు దశకు బిగ్బాస్ సీజన్ 6 చేరుకోవడంతో గత సీజన్ల కంటే అదిరిపోయే రేటింగ్ తో దూసుకుపోతోంది. దాదాపు 21 మందితో మొదలైన రియాల్టీ షోలో ప్రస్తుతం 6గురు సభ్యులు మిగలడం కొసమెరుపు. ఇకపోతే ఈ చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అసలు గుట్టు విప్పేశారు హోస్ట్ నాగార్జున. అంటే ఈరోజు ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారన్నమాట. దీంతో ఐదుగురు మాత్రమే అందులో మిగలనున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ ఎవరనేది ఆదివారం తెలిసిపోతుంది. ఈ సీజన్ ముందు నుంచి రేవంత్ విన్నర్ అవుతాడనే టాక్ ఎక్కువగా నడిచింది. ఎందుకంటే.. ఈసారి ఉన్న కంటెస్టెంట్లలో అత్యంత ఎక్కువ క్రేజ్ ఉన్నది అతనికే కాబట్టి. అయితే తన ఆట తీరుతో ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటూ టైటిల్ రేసులోకి దూసుకువచ్చిన ఇనయను గతవారం ఎలిమినేట్ చేసేసారు. బాస్. దీంతో ఇక రేవంత్ విన్నర్ కావడం ఖాయమని అంతా అనుకుంటున్న సమయంలో అసలు విన్నర్ ఎవరో గుట్టు విప్పేసింది గూగుల్.
అవును, బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ కాదని గూగుల్ చెబుతోంది. అతను కాకుండా మారేవారని అనుకుంటున్నారా? అతను మరెవరో కాదండి, రోహిత్. అవును, గూగుల్ లో బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరు అని సెర్చ్ చేస్తే రోహిత్ పేరు చూపిస్తుండడంతో అంతా ఇపుడు షాకవుతున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ ముందు వరకు రోహిత్ పేరు ఎక్కువ మందికి తెలియదు. ఈ షోలో అడుగుపెట్టిన తర్వాత కూడా అతనికి అంతగా స్క్రీన్ స్పేస్ లేదు. కానీ రోజు రోజుకీ తన ఆట తీరు.. తన ప్రవర్తనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రోహిత్.