బాలకృష్ణ తారకరామ థియేటర్ రిఓపెనింగ్ వెనుక ఇంత కథ ఉందా..?

కాచిగూడ లోని తారక రామ థియేటర్ను బాలకృష్ణ ఈ రోజున పునః ప్రారంభించారు. ఏషియన్ గ్రూప్ తో కలిసి తారకరామ థియేటర్ను సరికొత్త హంగులతో ముస్తాబు చేయడం జరిగింది. దాదాపుగా 600కు సీట్ల సామర్థ్యంతో. 4K ప్రొజెక్షన్తో థియేటర్ ని పునః నిర్మించారు. ఈనెల 16 నుంచి అవతార్ -2 సినిమాని ఇందులో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. తారకరామ థియేటర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

ఏసియన్ తారకరామ థియేటర్ ను ప్రారంభించిన బాలకృష్ణ

బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తారకరామ థియేటర్కు ఒక చరిత్ర ఉన్నది బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మా తల్లి జ్ఞాపకార్ధంగా కట్టాము. అది మాకు ఒక దేవాలయం లాంటిది. అదేవిధంగా ఈ థియేటర్ కూడా మాకు దేవాలయం తో సమానమని తెలియజేశారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల పేరు కలిసి వచ్చేలా ఈ థియేటర్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. 1978లో దీనిని ప్రారంభించాము అక్బర్ సలీం అనార్కలి చిత్రం మొదట ఆడింది అని తెలిపారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు కొన్ని కారణాల చేత ఈ థియేటర్ నిలిచిపోయిందనీ.. అయితే 1995లో తిరిగి పునః ప్రారంభించారని తెలిపారు బాలయ్య.

Hyderabad: Case filed against Tarakarama theatre for overcharging - India  Today

నేడు టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన హంగులతో ఈ థియేటర్ని మూడోసారి అందుబాటులోకి తీసుకు వచ్చాము.. డాన్ సినిమా ఇక్కడే 525 రోజులు ఆడింది నా సినిమాలు కూడా ఇక్కడ ఎన్నో ఘనవిజయాలను అందుకున్నాయి. అంతేకాకుండా నాకు ఈ థియేటర్ ఒక సెంటిమెంట్ అని మా అబ్బాయి తారకరామతేజ నామకరణాన్ని కూడా నాన్న గారు ఈ థియేటర్ లోనే చేశారని తెలిపారు. ఏషియన్ సినిమా సంస్థతో మాకు చాలా బంధం ఉందని తెలిపారు వాళ్లతో కలిసి తారకరామాను ప్రేక్షకులకు అందుబాటులో తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు బాలయ్య.