టాలీవుడ్ లోకి మొదట ఇష్టం చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది హీరోయిన్ శ్రియ. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఈమె ఎంతో మంది హీరోల సరసన నటించింది. అలా టాలీవుడ్ లో ఇప్పటికీ కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది శ్రియ. ఒకవైపు తెలుగులో నటిస్తుండగానే మరొకవైపు కోలీవుడ్, బాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. ఇక వివాహం తర్వాత సినిమాలు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ కూతురికి కూడా జన్మనిచ్చింది.
అయినప్పటికీ మాత్రం తను గ్లామర్ చూపించడం విషయంలో మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు శ్రియ. ఎక్కువ సమయాన్ని తన భర్త పిల్లలకు మాత్రమే కేటాయిస్తూ తమ ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇదంతా ఇలా ఉండగా శ్రియ బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయాన్ని తెలియజేయలేదు. అంతేకాకుండా శ్రియ వివాహాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాను అసలు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదు అందుకు గల కారణాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.
శ్రియ దృశ్యం 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. తన కూతురు రాధా కడుపులో ఉన్న సమయంలో ఆ అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలనుకున్నాను.. తను లావుగా అవుతూ ఉండడంతో దానిని చూసి చింతించాల్సి వచ్చింది. అభిమానులకు ఈ మీడియాకు ఈ విషయం తెలిస్తే తన బాడీ షేప్ గురించి ఎక్కువగా రాస్తారు.. ఆ ప్రభావం తన బిడ్డ పై పడుతుందని గ్రహించి అందుకే ఇలాంటి వాటి పై ఎక్కువ సమయాన్ని పెట్టి వృధా చేయాలనుకోలేదు అందుకోసమే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టలేదని అసలు విషయాన్ని తెలిపింది శ్రియ.