మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్లు అన్నీ కూడా మంచి భజ్ ను అందించాయి.ఇప్పుడు ఈ చిత్రంపై తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాని ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాల సెంటిమెంటుగా పోలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు చిరంజీవి కూడా ఆ వైపుగానే ప్రయాణిస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చిరంజీవికి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఆయన పీ ర్ టీమ్ మాత్రం తెగ ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రం ఎలా ఉండబోతోంది ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది..ఎలాంటి ఓపెనింగ్ వస్తాయని పరిస్థితి ఇప్పుడు అభిమానులతో పాటు, మెగా కుటుంబాన్ని కూడా ఉక్కరి బిక్కిరి చేస్తోందని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. బాలయ్య సినిమాకి పోటీగా మరొకసారి తన సినిమాని దింపుతున్న చిరంజీవి పర్వాలేదు కానీ ఏమైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుందని సినీ ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు.
ఇప్పటికే గత రెండు మూడు సినిమాల నుంచి చిరంజీవి ఇమేజ్ పెద్దగా పెరగలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆచార్య సినిమా ప్రభావం బాగా బెడిసి కొట్టింది ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను కూడా పెద్దగా సర్ప్రైజ్ చేయలేకపోయింది. ఇప్పుడు తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ ఫంక్షన్ కోసం హైదరాబాదు నుంచి ఒక స్పెషల్ ట్రైన్ నడపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. వరంగల్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి పైన ఈ స్పెషల్ ట్రైన్ విశాఖకు చేరబోతున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ట్రైన్ ద్వారానే వేదిక ఉన్న స్థలానికి చేరుకోవచ్చని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. గతంలో ఆంధ్రవాల సినిమాకి కూడా ఇలాగే రైలు నడిపి మరి జనాలను తరలించారు. కానీ ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడిన డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు మెగా అభిమానులలో కూడా ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఉండబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.