టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో పలు సినిమాలు ప్రకటించిన తర్వాత కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతున్నాయి. అలాంటి వారిలో కొంతమంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాని గత ఏడాది ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్లో చిత్రాన్ని కూడా ప్రకటించి ఇప్పటికీ ఏడాది పైన కావోస్తున్న ఈ సినిమాకు సంబంధించి సూటింగ్ అప్డేట్లను మాత్రం ప్రకటించలేదు.
మహేష్, త్రివిక్రమ్ సినిమాలో షూటింగ్ కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంభో మాత్రం ఇప్పటికి సినిమా షూటింగ్ ఎప్పుడనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వీటితోపాటు యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు కూడా డీజే టిల్లు -2 సినిమాని ప్రకటించి ఇప్పటికీ కొన్ని నెలలు కావస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గురించి చెప్పలేదు. మహేష్ , ఎన్టీఆర్ వంటి చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ ,కొరటాల శివ ఈ ప్రాజెక్టులతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. మహేష్ చిత్రంలో హీరోయిన్గా పూజ హెగ్డే అని ఫిక్స్ చేయగా ఎన్టీఆర్ సినిమాలో మాత్రం ఇప్పటివరకు హీరోయిన్ కి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తారక్ అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, మహేష్ బాబు ఈ చిత్రాలకు కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు మరి వచ్చే ఏడాది ఈ ఇద్దరు హీరోల సినిమాలు థియేటర్లో విడుదలవుతాయి లేదో చూడాల్సి ఉంది.