విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `నారప్ప`. తమిళ చిత్రం `అసురన్` సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు కీలక పాత్రలలో నటించారు.
వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా 20 జులై 2021న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలైంది. ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే అభిమానులు కోరిక మేరకు వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 13న థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా కి కొన్ని చోట్లా మంచి ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ కూడా.. కలెక్షన్ల పరంగా అంచనాలు అందుకోలేకపోయింది. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా రూ. 22 నుండి 25 లక్షల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.