రామ్ చ‌ర‌ణ్ కు అలాంటి లోపం ఉందా.. బ‌య‌ట‌పడ్డ షాకింగ్ న్యూస్‌?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంతరం రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ కు ఓ లోపం ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ పాత్రకు నత్తి ఉంటుందట.

నత్తితో మాట్లాడుతూ అద్భుతంగా ఆకట్టుకుంటాడట. అంతేకాదు ఈ పాత్ర సినిమా రేంజ్ ను పెంచే విధంగా శంక‌ర్ తీర్చిదిద్దుతున్నాడ‌ని కూడా అంటున్నారు. కాగా గతంలో రంగస్థలం సినిమాలో వినికిడి లోపం ఉన్న పాత్రను పోషించి అద‌ర‌గొట్టేసిన‌ రామ్ చరణ్.. ఈసారి నత్తి పాత్రలో ప్రేక్షకుల‌ను ఏ మేరకు అలరిస్తాడో చూడాల్సి ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.