టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు ఆయన సినిమాలు చూసుకుంటే కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది. అదే ఆయన సినిమాల్లో కీలకమైన లేడీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కోసం ఆయన తన సినిమాల కోసం బాగా పేరు గడించిన సీనియర్ నటిమణులనే ఏరి కోరి ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకు ఉన్న నిడివి, ఆ క్యారెక్టర్ కు ఉన్న బలం అందులో ఎవరు ఇమడగలరన్న, సామర్ధ్యాలతో పాటు పాత్రకు ప్రాణం పోసే సీనియర్ హీరోయిన్స్ నే సెలెక్ట్ చేస్తాడు.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తాజాగా మహేష్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 28వ సినిమా కోసం ఒ క్రేజీ హీరోయిన్ రంగాల్లోకి దించుతున్నారని తెలుస్తుంది. త్రివిక్రమ్ ఈసారి సౌత్ నుంచి కాకుండా.. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా? బాలీవుడ్ అందాలభామ రాణి ముఖర్జీ. ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన రాణి ముఖర్జీ.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ.. అది కూడా రెగ్యులర్ గా కాకుండా తనకు నచ్చిన స్క్రిప్ట్ దొరికినప్పుడే సినిమాలు చేసుకుంటుంది.
వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమాలలో కాస్త జోరు తగ్గించిన మాట నిజమే కానీ, ఆమె క్రేజ్ మాత్రం బాలీవుడ్ లో ఇప్పటికీ తగ్గలేదు. అందుకే మహేష్ కోసం త్రివిక్రమ్ ఏరి కోరి మరి ఆమెను మహేష్ కోసం టాలీవుడ్‌కు తీసుకొస్తున్నాడని తెలుస్తుంది. ఆమెను మహేష్ సినిమాలు తీసుకోవడానికి ఇంకో కారణం ఉంది. మహేష్ తో చేస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.
మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ భారీ తారాగణంతో ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. హారిక& హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాను మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.