రాజాం సీటులో గ్రీష్మ..చినబాబు గ్రీన్ సిగ్నల్?

ఏపీలో కొన్ని స్థానాల్లో టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సీటు దక్కించుకోవడం నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో రాజాం సీటులో కూడా పోటీ ఉంది. ఇక్కడ మొదట నుంచి ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి..తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పటించుకోవాలని చూస్తున్నారు. అయితే వరుస ఓటముల వల్ల గత ఎన్నికల్లో రాజాం సీటుని కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్ లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు.

మళ్ళీ పార్టీ పుంజుకుంటుందనే తరుణంలో కొండ్రు పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఆయనే రాజాం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాలని చూసుకుంటున్నారు. ఇక ఈ సీటు కోసం గ్రీష్మ సైతం గట్టిగా ట్రై చేస్తున్నారు. మొదట నుంచి ఈ సీటు తన తల్లి పోటీ చేశారు కాబట్టి..ఇప్పుడు ఆ సీటు తనకు ఇవ్వాలని అడుగుతున్నారు. అలాగే అక్కడ దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఇక డైరక్ట్ గా నారా లోకేష్‌ని సీటు కూడా అడిగేశారు.

రాజాం సీటు ఇవ్వాలని నారా లోకేష్‌ని కోరినట్లు ఆమె ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందరం కలిసి పనిచేద్దామని లోకేష్ చెప్పినట్లు చెప్పారు. అయితే సీటు  విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా? అనేది క్లారిటీ లేదు. కలిసి పనిచేద్దామని అన్నారు గాని..సీటు ఇస్తున్నట్లు చప్పలేదు. ఇదే సమయంలో ఈ నెల 24న రాజాంలో చంద్రబాబు పర్యటన ఉంది.

ఆ పర్యటనని విజయవంతం చేయాలని ఓ వైపు కొండ్రు వర్గం, మరో వైపు ప్రతిభా భారతి వర్గం ట్రై చేస్తుంది. ఇక ఈ టూర్‌లో అయినా బాబు…రాజాం సీటు సమస్యని పరిష్కరిస్తే బెటర్..లేదంటే ఆధిపత్య పోరు మరింత పెరిగి టీడీపీకే నష్టం జరుగుతుంది.