`ఆర్సీ 16`కి బుచ్చిబాబు రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే.. స్టార్ హీరోలు కూడా వేస్టేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కు ఇది 16వ ప్రాజెక్ట్స్ కావ‌డంతో.. `ఆర్సీ 16` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె ఈ మూవీని అనౌన్స్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబాడ్డీ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించ‌బోతున్నార‌ట‌.

వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ మూవీకి డైరెక్ట‌ర్ బుచ్చిబాబు అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.

ఎందుకంటే, ఆయ‌న ఈ సినిమాకు ఏకంగా రూ. 10 కోట్లు పారితోషికం కింద పుచ్చుకుంటున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. అయినా స‌రే ఆయ‌న ఈ రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్లు కూడా ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే బుచ్చిబాబు ముందు స్టార్ హీరోలు కూడా వేస్టే అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Share post:

Latest