విశ్వక్ సేన్ ఈసారైనా సక్సెస్ అందుకుంటారా..!!

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ వరుస ప్లాప్ లను చవి చూస్తున్నారు. దీంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. పాగల్ సినిమాతో డిజాస్టర్ ని సొంతం చేసుకున్న విశ్వక్ ఆ తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. అయితే ఆ సక్సెస్ ను మాత్రం ఎక్కువసేపు నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత తమిళంలో హిట్ అయిన ఓ మై కడుగులే ఆధారంగా తెరకెక్కించిన ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో వెంకటేష్ కీలకమైన అతిథి పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

I Missed Hit 2 Due To Busy Schedules: Vishwak Senవిశ్వక్సేన్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం ఫస్ట్ రోజు షాక్ ఇచ్చింది ఇదంతా ఇలా ఉండగా యాక్షన్ కింగ్ అర్జున్ సినిమా కారణంగా విశ్వక్ సేన్ మరొకసారి వార్తల్లో నిలుస్తున్నారు. కొంతవరకు ఈ వివాదం విశ్వక్ కు మైనస్ గా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అర్జున్ తన కూతురు ఐశ్వర్యాన్ని హీరోయిన్గా పరిచయం చేస్తూ.. విశ్వక్ హీరో గా ఒక భారీ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.అందుకోసం పవన్ కళ్యాణ్ తో కూడా క్లాప్స్ కొట్టి ముహూర్తానికి సంబంధించి కొన్ని చిత్రీకరణ ఫోటోలను విడుదల చేశారు.

Paagal Hero Vishwak Sen Announced New Project Titled As Das Ka Dhamki,  Deets Here - Sakshi

సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే క్షణంలో విశ్వక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోబోతున్నారని షాక్ ఇచ్చారు. దీంతో అర్జున్ ఒక్కసారిగా హార్ట్ కావడంతో విశ్వక్ సేన్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తిరిగి అదే స్థాయిలో అర్జున్ కు కౌంటర్ కూడా ఇచ్చారు విశ్వక్. ఇక ఆ తర్వాత విశ్వక్ అతిధి పాత్రలో నటించిన ముఖచిత్రం సినిమా విడుదలైన పాత్ర పరవాలేదు అనిపించుకున్న అభిమానులు మాత్రం ఇలాంటి క్యారెక్టర్ ని ఎందుకు చేశారో అన్నట్లుగా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్న దమ్కీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ చిత్రమైన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే ఇక అంతే అని చెప్పవచ్చు.