ఫ్రీ టైమ్ దొరికితే నాకు, ప్ర‌భాస్‌కు అదే ప‌ని.. కృతి స‌న‌న్ బోల్డ్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ `ఆదిపురుష్` అనే సినిమాలో జంట‌గా నటించిన సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ‌ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ప్రభాస్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ప్రస్తుతం నేను తెలుగు బాగా మాట్లాడుతున్నందుకు కారణం ప్రభాసే. ఆదిపురుష్ సెట్ లో ఫ్రీ టైం దొరికిందంటే చాలు నాకు ప్రభాస్ తెలుగు నేర్పించేవాడు.

దానికి బదులుగా నేను ఆయనకు హిందీ నేర్పించాను. ఇప్పుడు ఆయన చక్కటి హిందీ మాట్లాడుతున్నారు. అలాగే నేను కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నా. ఇక మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. అందరితోను స్నేహంగా ఉంటాడు` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కృతి స‌న‌న్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.