యాటిట్యూడ్ స్టార్ లిప్‌లాక్ చూస్తే మతులు పోవాల్సిందే.. మ‌ళ్లీ ట్రోలింగ్ త‌ప్ప‌దా…!

చిత్ర పరిశ్రమంలోకి ఎందరో నట వారసులు వచ్చారు. వారిలో కొందరు ఇప్పుడు సినిమా పరిశ్రమంలో అగ్ర హీరోలుగా ఉన్నారు. అయితే బుల్లితెర అగ్ర హీరోగా అగ్ర నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఆయన కొడుకు చంద్రహాస్ ని హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు. అయితే ఆయన తనయుడికి హీరోగా పరిచయం కాకముందే సోషల్ మీడియాలో కావాల్సినంత పేరు వచ్చింది. అంతే కాకుండా అతనికి ఆటిట్యూడ్ స్టార్ స్టార్ అంటూ కూడా బిరుదు ఇచ్చేశారు.

ప్రభాకర్ కొడుకు లిప్ లాక్ తో మతి పోగొట్టాడు బాబోయ్‌ | Chandrahass Black Dog For A White Chick Heroine Glimpse Details, Chandrahass ,Black Dog For A White Chick Heroine Glimpse, Prabhakar, Black Dog For

ఈ క్రమంలోనే గతంలో జరిగిన చంద్రహాస్ పరిచయం ప్రెస్ మీట్ సందర్భంగా అక్కడ ఆయన చేసిన ఓవరాక్షన్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అలాంటి చంద్రహాస్ హీరోగా వస్తే ఎలా ఉంటుంది అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొందరు అతని ట్రోల్ చేస్తూ హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటే మరికొందరు మాత్రం అతని గురించి పాజిటివ్‌గా చూస్తున్నారు.

చంద్రహాస్ స్టంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే.. మరీ ఈ రేంజ్ యాక్షనా | Prabhakar Son Attitude Star Chandrahas Boxing Practice Video Goes Viral Details, Prabhakar, Chandrahas, Tollywood, Gym Video, Social ...

ఈ సందర్భంలోనే చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ వీడియో విడుదలైంది. అందులో చంద్రహాస్ హీరోయిన్ తో ఇచ్చిన డీప్ లిప్ లాక్ చూసి అందరూ షాక్ అయ్యే విధంగా చంద్రహాస్ లిప్ లాక్ ఉంది.

ప్రభాకర్ కొడుకు లిప్ లాక్ తో మతి పోగొట్టాడు బాబోయ్‌ | Chandrahass Black Dog For A White Chick Heroine Glimpse - Telugu Blackdog, Chandrahass, Prabhakar

మొదటి సినిమాతోనే ఈ రేంజ్ లో లిప్ లాక్ ఇచ్చిన చంద్రహాస్ రాబోయే సినిమాలలో తన యాటిట్యూడ్ తో వరుస అవకాశాలు దక్కించుకుంటాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు సోషల్ మీడియాలో ఆ వీడియోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ చంద్రహాస్ రొమాన్స్ లో యాక్షన్స్ లో కుమ్మేస్తాడని అంతా భావిస్తున్నారు. తన మీద వచ్చిన ట్రోల్స్ ను పాజిటివ్‌గా తీసుకొని చంద్రహాస్ నటిస్తున్న మొదటి సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.