అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు..ఏంది రా ఈ లొల్లి..?

అమ్మ పెట్టనివ్వదు అడుక్కుతినివ్వదు. ఈ సామెత మనం ఇంట్లో సరదాగా అమ్మ నాన్నలు చెబుతున్నప్పుడు వింటూ ఉంటాం . లేదా మన ఇంట్లో పెద్దవారు ఎప్పుడైనా సరే ఈ సామెతను వాడుతూ ఉంటారు. అయితే ఈ సామెత ప్రజెంట్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటున్నారు నెటిజన్స్. దానికి మెయిన్ రీజన్ పూరి జగన్నాథ్ . ప్రజెంట్ ఈయన ఖాళీగా ఉన్నాడు అన్న విషయం మనకు తెలిసిందే.

రీసెంట్ గా లైగర్ సినిమాతో ఇండస్ట్రీని ఊపు ఊపేద్దామనుకున్న పూరి జగన్నాథ్ ప్రజెంట్ ఏమీ ఉపలేక సింగిల్ గా ఇంట్లో కూర్చుని ఉన్నాడు . భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించారు . అంతేకాదు హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మెరిసింది . కాగా ఇంతటి భారీ తారాగాణం తో తెరకెక్కిన సినిమా ఓ రేంజ్ లో హిట్ అవుతుందని అంత అనుకున్నారు . సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు . కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా మారింది .

మరీ ముఖ్యంగా డైరెక్షన్ పరంగా చెత్తగా ఉండడంతో లైగర్ సినిమా కనీసం పెట్టిన డబ్బులు కూడా వసూలు చేసుకోలేకపోయింది. నటన పరంగా విజయ్ దేవరకొండ మెప్పించినప్పటికీ ..డైలాగ్స్ ను ఆకట్టుకునే విధంగా చెప్పలేకపోయాడు. దీంతో విజయ్ దేవరకొండ సైతం నెట్టింట ట్రోల్ చేశారు అభిమానులు . కాగా ఈ సినిమా హిట్ అయి ఉంటే పూరి జగన్నాథ్ పొజిషన్ వేరేలా ఉండేది . అయితే ఫ్లాప్ అవడంతో తన తర్వాతి డ్రీం ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయినట్లు తెలుస్తుంది .

Puri Jagannadh : పూరీ జ‌గ‌న్నాథ్ ఫ్యామిలీ మ‌ధ్య చిచ్చు పెట్టిన ఛార్మి..  స్పందించిన ఆకాశ్ పూరీ | The Telugu News

అంతేకాదు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఏ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. కాగా సొంత కొడుకు సైతం పూరి డైరెక్షన్ లో నటించడానికి ఇష్టపడడం లేదట . ఈ క్రమంలోనే ఉన్న కొడుకు ఆఫర్స్ ఇవ్వక.. మిగతా స్టార్ హీరోలు కూడా సినిమా అవకాశాలు ఇవ్వకుండా అటూ ఇటూ ఎటూ కాకుండా సింగిల్గా మిగిలిపోయాడు పూరి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే లైగర్ సినిమా తీయ్యకుండా ఉంటే పూరి జగన్నాథ్ కనీస పరువు మిగిలి ఉండేది అంటున్నారు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ . చూద్దాం ఇతగాడు తన నెక్స్ట్ సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో.. ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

Share post:

Latest