తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటారు . పాపం బహుశా కృతి శెట్టి విషయంలో అదే జరిగినట్లు ఉంది . భారీ అంచనాలు పెట్టుకొని ఉన్న సినిమా నుండి కృతి శెట్టి తప్పుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అంతేకాదు ఈ సినిమా నుండి కృతి శెట్టి కావాలని బయటకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది . దీంతో సినీ వర్గాలలో కృతశెట్టి పేరు రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.
మనకు తెలిసిందే ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఫస్ట్ సినిమాతోనే ఇంతటి హిట్ సాధించిన హీరోయిన్ ఎవరైనా సరే తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు . అలాగే కృతిశెట్టి కూడా మంచి బుర్రతో తర్వాత సినిమాలను కూడా పక్కాగా ప్లాన్ చేసుకొని రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా మలుచుకుంది. ఈ క్రమంలోనే ఓవర్ హెడ్ వెయిట్ తో కృతిశెట్టి మిగతా మూడు సినిమాలలో శృతి మించి నటించిన తీరు జనాలకు ఎబ్బెటుగా అనిపించింది. దీనితో ఒక్కసారిగా మూడు సినిమాలు ఫ్లాప్ చేసి కృతికి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే కృతి శెట్టి తన ఆశలన్నీ నాగచైతన్యత నటిస్తున్న తదుపరి సినిమాపై పెట్టుకొని ఉంది. కాగా మొదటి మూడు సినిమాలు హిట్ అవ్వడంతో కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు అందుకున్న ఈ ఉప్పెన బ్యూటీ ఈ క్రమంలోని సూర్యతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడింది. కాగా ఈ సినిమా నుండి కృతిశెట్టి తప్పుకున్నట్లు తెలుస్తుంది . దీనికి కారణం కృతి శెట్టి కి చెప్పిన స్క్రిప్ట్ ఒకటి డైరెక్షన్ స్క్రిప్ట్ మరొకటిగా ఉంది అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగినట్లు .. అమ్మడు సినిమాను చేయను పో అంటూ ముఖం మీద చెప్పిందట, దీంతో ఫైర్ అయిపోయిన డైరెక్టర్ కృషిని సినిమా నుంచి తీసేస్తామని మిగతా టీం తో చర్చిస్తున్న క్రమంలో కృతి శెట్టినే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కృతిశెట్టికి మూడు సినిమాలు హిట్ పడేసరికి హెడ్ వెయిట్ పెరిగిపోయింది అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!