ప్ర‌భాస్ చేతులారా వ‌దులుకున్న రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు.. అవి ఇవే!

ఒక హీరోకు అనుకున్న కథను మరొక హీరో చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు హీరోలు తెలిసో.. తెలియకో సూపర్ హిట్ చిత్రాలను సైతం వదులుకుంటుంటారు. ఈ లిస్టులో ప్రభాస్ కూడా ఒకడు. ఈయన గతంలో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో స్వయంగా వెల్లడించారు.

ఇంతకీ ఆ రెండు చిత్రాలు మరేవో కాదు.. ఒకటి `ఆర్య` అయితే మరొకటి `భద్ర`. `ఆర్య` సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే అయితే ఈ చిత్రాన్ని మొదట ప్రభాస్ తో చేయాలని భావించారట. ఆయనకు కథ కూడా వినిపించారట.. కానీ, ప్రభాస్ మాత్రం తన ఇమేజ్ కు `ఆర్య` కథ‌ సెట్ కాదని రిజెక్ట్ చేశాడట.

ఇక ఆ తర్వాత `భద్ర` సినిమాను సైతం దిల్ రాజు ప్రభాస్ తో చేయాలని భావించాడట. కానీ ఈ సినిమాను కూడా ఆయన రిజెక్ట్ చేశారు. దాంతో ప్రభాస్ స్థానంలో రవితేజను తీసుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొత్తాని ప్రభాస్ చేతులారా రెండు సూపర్ హిట్ చిత్రాలను వదులుకొన్నాడు.