మహేష్ రాజమౌళి సినిమాలో… ఆ తమిళ్ స్టార్ హీరో ఉన్నారా..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి‍‍- త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. ఆయన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాలో బిజీ అవునన్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. ఈ సినిమాని రాజమౌళి ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడని ఆయన తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో ఓ విలన్ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఆ తమిళ స్టార్ హీరోమరెవరో కాదు సూర్య తమ్ముడు కార్తి .. ఇప్పటికే సినిమా యూనిట్ కార్తి తో సంప్రదింపులు జరిపారని.. ఈ సినిమాలో ఓ విభిన్నమైన పాత్రలో కార్తి నటించబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి సినిమాలో కార్తీక్ నటించటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నాడు. పూర్తి స్క్రిప్టు పూర్తవకముందే ఎన్నో అంచనాలు పెంచేసిన ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. వచ్చే సంవత్సతరం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.