60 ఏళ్ల ముసలాడితో అఫైర్.. ఓపెన్ గానే గుట్టు విప్పిన నటి కస్తూరి!

నటి కస్తూరి శంకర్.. నాగార్జున హీరోగా నటించిన `అన్నమయ్య` సినిమాలో హీరోయిన్ కస్తూరి అంటే ఇప్పటి జనరేషన్ వారికి గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు కావడంతో ఆమె పేరు చెబితే చాలామందికి తెలియదు. ఇటీవల ఆమె ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమయ్యే `గృహలక్ష్మి` అనే సీరియల్ లో నటించే కథానాయక తులసి అంటే అందరికీ సుపరిచితమే. అయితే ఈ సీరియల్లో చక్కటి తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుందో బయట మాత్రం అంత బోల్డ్ గా ఉంటుంది.

కస్తూరి అప్పట్లో తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్గా కనిపించింది. అన్నమయ్య సినిమాలో నాగార్జున జంటగా నటించిన కస్తూరి ఆ తరువాత కాలంలో ఇండస్ట్రీలో కనుమరుగయిపోయింది. ఇటీవల కస్తూరి ఓ ఇంటర్వ్యూలో అయితే దానికి అసలు కారణం తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలే అంటూ వెల్లడించింది. అయితే తనంటే గిట్టని వారు తన గురించి కొన్ని తప్పుడు ప్రచారాలు చేశారంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.

అదేమిటటే నేను తమిళ్ ఇండస్ట్రీలోని ఓ 60 ఏళ్ల ముసలి బిజినెస్ మ్యాన్ తో అఫైర్ పెట్టుకున్నానని నాకు అతనితో అక్రమ సంబంధం ఉందని ప్రచారాలు చేశారు.60 ఏళ్ల ముసలాడితో అఫైర్.. ఓపెన్ గానే గుట్టు విప్పిన నటి కస్తూరి… అటువంటి తప్పుడు ప్రచారాలు కారణంగా నేను చాలా బాధపడ్డాను. అయినప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీ అన్నాక సెలబ్రిటీల గురించి ఇట్లాంటి వార్తలు రావడం కామన్ అంటూ అవి తాను పెద్దగా పట్టించుకోలేదు అంటూ కస్తూరి ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. అయితే కస్తూరికి అంటగట్టిన ఆ ముసలి బిజినెస్ మ్యాన్ ఎవరు? అతని పేరు మాత్రం కస్తూరి బయట పెట్టలేదు. ప్రస్తుతం కస్తూరి మాత్రం సీరియల్స్, టెలివిజన్ హోస్టింగ్ మరియు సపోర్టింగ్ పాత్రలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రజెంట్ కుర్ర హీరోయిన్లతో సమానంగా కస్తూరి తన అందాలను ఆరపోస్తూ అందరినీ ఫిదా చేస్తూ ఉంటుంది.