మేక‌ప్ లేకుండా డింపుల్ హయతిని చూశారా? అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేరు బాబోయ్‌!

డింపుల్ హయాతీ… వరుణ్ తేజ్ ప్రముఖ పాత్రలో నటించిన `గద్దలకొండ గణేష్` సినిమాలో `జర్ర జర్ర` అనే ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటతో మంచి గుర్తింపు పొందిన హయాతీకి తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఆ తరువాత తెలుగులో `యురేకా` అనే సినిమా చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ లో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన `అంత్రాంగి రే` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

 

ఈ సినిమాలో ఆమె చేసింది గెస్ట్ రోల్ అయినప్పటికీ కూడా తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక విశాల్ హీరోగా తెరకెక్కిన `సామాన్యుడు` అలాగే రవితేజ `ఖిలాడి` సినిమాలో హీరోయిన్గా చేసి మంచి మార్కులు కొట్టేసింది.ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.

ఓ పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క హయాతీ సోకుల రచ్చకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అయితే ఈమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటోలో ఆమె మేకప్ లేకుండా కనిపించడంతో అందరినీ కలవరంలో పడేసింది. ఇక ఈ డీ గ్లామర్ పిక్ ని చూసిన నెటిజన్లు తీక్షణంగా పరీక్షిస్తే తప్ప ఫోటోలో ఉన్నది హయాతీ అని పోల్చుకోలేకపోతున్నారు. అయితే ఎప్పుడు గ్లామరస్ ఫొటోస్ తో హంగామా చేసే ఈమె ఇప్పుడు డీ గ్లామర్ ఫోటోతో కుర్రాళ్ళకి మతిపోకూడదు. ప్రస్తుతం హయాతి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.