స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. అంతా దాని కోసమేనా..?

ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇక తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో 30వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా కథ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఆలస్యం కావడానికి ముఖ్య కారణం కూడా అదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడమే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ రీసెంట్గా ఫైనల్ స్టోరీని వినిపించారని గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లుగా సమాచారం.

RRR: Ram Charan SS Rajamouli For A Making Him Experience A Wonderful Love  Of The Japan Audience
అయితే రీసెంట్గా ఎన్టీఆర్ RRR సినిమా కోసం జపాన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ సినిమా ప్రమోషన్లలో భారీ స్థాయిగా చేసి విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అయితే అక్కడ మీడియా ముందు జూనియర్ ఎన్టీఆర్ చాలా స్పెషల్గా కనిపించారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఎందుచేత అంటే జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త లుక్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు.

అయితే ఎన్టీఆర్ ఈ షేప్ లోకి రావడానికి కారణం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 301 సినిమాలు క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఇలా మారిపోయారు అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కానీ ఇంకా కొంత మార్పు రావాల్సి ఉండగా అందుకే ఇలా ఫిట్నెస్ గా మారి కనిపిస్తున్నారని సమాచారం.గతంలో డైరెక్టర్ కొరటాల శివ జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి అంతకుమించి అనేలా ఉంటుందని సినీ ప్రేక్షకులు అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.