మరోసారి శ్రీయ బరితెగింపు.. పబ్లిక్ గా భర్తతో లిప్ లాక్ లు!

శ్రియ సరన్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు, తమిళ్ తోపాటు నార్త్ లో కూడా ఈ బ్యూటీ తన అందంతో, నటనతో సత్తా చాటింది. అయితే శ్రీయ ఒకప్పుడు గ్లామర్ తో ఊపేసిన ఇప్పుడు మాత్రం నటనకు స్కోప్ సినిమాలే ఎంచుకుంటుంది. శ్రీయ పెళ్లి తర్వాత కూడా టాప్ ఆర్డర్లో రాణిస్తుంది.

లాక్ డౌన్ టైంలో ఓ పాపకి జన్మనిచ్చింది. ఓ బిడ్డకి తల్లి అయినా కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటీవల `త్రిబుల్ ఆర్` సినిమాలో కూడా ఓ ప్రముఖమైన పాత్రలో శ్రియ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే శ్రియ మరో పక్క సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. అంతేకాకుండా గ్లామర్ ఫోటోలు అలాగే భర్తతో గడిపే రొమాంటిక్ వీడియోలు కూడా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

తాజాగా ఈమె ముంబైలో నటుడు కృష్ణకుమార్ హోస్ట్ చేసిన దీపావళి బ్యాష్ పార్టీకి తన భర్తతో కలిసి హాజరైంది. ఎంట్రీ వద్ద ఫోటోలకు పోజులిస్తున్న శ్రియ‌ తన భర్త ఆండ్రూ రాగానే అతని వైపు రొమాంటిక్ లుక్ ఇవ్వడంతో ఆండ్రు లిప్ లాక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. ఇక వెంటనే శ్రియ హ్యాపీగా అతనితో లిప్ లాక్ ఇవ్వగా ఫోటోగ్రాఫర్లు వన్స్ మోర్ అనడంతో మళ్లీ లిప్ లాక్ ఇచ్చుకున్నారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు మరోసారి శ్రియ బరితగించింది అంటూ.. మరీ పబ్లిక్ గా భర్తతో లిప్ లాక్ లు ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే శ్రియ భర్త టూ రొమాంటిక్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://twitter.com/filmyhuntlive/status/1584895477933568001?s=20&t=hZ3gjm6QEzmvoCXPvbmy-g