అమెజాన్ ప్రైమ్ లో ఒకేసారి రెండు బడా మూవీస్.. ఎప్పుడంటే..!!

కరోనా తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రాకుండా కేవలం ఓటిటి లలోనే పలు చిత్రాలను చూస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఓటీటి ల హవా బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ప్రతివారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు కంటే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనే స్ట్రిమింగ్ అవుతున్న చిత్రాల పైనే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో థియేటర్లో విడుదలైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటిలో స్ట్రిమింగ్ అవుతాయి అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెజాన్ ప్రైమ్ ప్రేక్షకుల కోసం ఒక గుడ్ న్యూస్ అని తెలియజేసింది.

Kantara (Kannada) (2022) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow
ఓటిటి లలో ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ మాత్రమే పై చేయి ఉండేది. ఇటీవల RRR చిత్రంతో మరింత క్రియేషన్ సొంతం చేసుకొని టాప్ లో నిలిచింది. అయితే వీటన్నిటిని మించడానికి అమెజాన్ ప్రైమ్ గత కొంతకాలంగా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో ఆశించిన స్థాయిలో బ్లాక్ బాస్టర్ సినిమాలు అమెజాన్ కు దక్కడం లేదు. తాజాగా ఇలాంటి సమయంలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు అమెజాన్ సొంతం చేసుకుంది. ఇటీవలే భారీ స్థాయిలో విడుదలైన పాన్ ఇండియా చిత్రాలలో పొన్నియన్ సెల్వన్ -1, కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన కాంతారా చిత్రాల హక్కులను సైతం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

Ponniyin Selvan - Part 1 Day 3 Box Office Collection - Sacnilk

ఈ రెండు చిత్రాలను వచ్చే నెల నవంబర్ మొదటి వారంలో స్ట్రిమింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రాలు తెలుగుతోపాటు ఇతర భాషలలో కూడా చూడని వారు చాలామంది ఉన్నారు. కాంతారా చిత్రం నవంబర్ 4న స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఉంది. కొన్నియన్ సెల్వన్ ఒక వారం గ్యాప్ ఇచ్చి విడిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రాలు కూడా ఓటీటి లో ఎలా ఆదరిస్తారో ప్రేక్షకులు చూడాలి.