సంగీత.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన `ఖడ్గం` సినిమాలో రవితేజ సరసన నటించి.. `ఒకే ఒక్క ఛాన్స్` అనే డైలాగ్ తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, శ్రీకాంత్, శ్రీహరి లాంటి స్టార్స్ అందరితోనూ హీరోయిన్గా నటించింది.
అంతేకాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసి ఆ తర్వాతి కాలంలో టాలీవుడ్ లో హోమ్లీ క్యారెక్టర్ తో గుర్తింపు దక్కించుకుంది. కోలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ క్రిష్ ని 2009లో పెళ్లి చేసుకుని శివియా అనే పాపకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సంగీత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జ్ గా నిర్వహిస్తుంది. అయితే సంగీత ఇటీవలే తన 44వ పుట్టినరోజుని ఎంతో ఘనంగా తన ఫ్యామిలీతో అలానే సెలబ్రిటీ ఫ్రెండ్స్ తో కలిసి జరుపుకుంది.
ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా సీనియర్ నటి రాధిక, సంఘవి, స్నేహ, ప్రీతి, కిక్ శ్యామ్, మీనా, మహేశ్వరి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి తదితరులు ఈ పార్టీకి అటెండ్ అయ్యి తెగ సందడి చేశారు. ప్రస్తుతం సంగీత 44వ బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.