నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అటు తరువాత బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఈ చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఇక ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అలాగే కీలకమైన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తూ ఉన్నది. దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా వచ్చేయేడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.
ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ ఈ సినిమాపై బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెళ్ళబడ్డాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నది. అయితే తాజాగా ఈ సినిమా కోసం బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది హీరోలు ప్రమాదకరమైన స్టంట్స్ కోసం డూపులను ఉపయోగిస్తూ ఉంటారు.
కానీ బాలకృష్ణ మాత్రం రిస్క్ అని తెలిసి కూడా వెనక్కి తగ్గకుండా ఆ స్టంట్స్ పూర్తి చేసినట్లు సమాచారం ఏదేమైనా ఆరుపదుల వయసులో కూడా బాలకృష్ణ ఇలా రియల్ స్టంట్స్ చేయడం నిజంగా ఇతర హీరోలకు ఆదర్శప్రాయం అని చెప్పవచ్చు. మరి చిత్రంతో బాలయ్య మంచి విజయాన్ని అందుకొని సక్సెస్ను కొనసాగిస్తారేమో చూడాలి. బాలకృష్ణ ఆహ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి కూడ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.