కెరీర్ లో తొలిసారి యాడ్స్ కు ఓకే చెప్పిన బాలయ్య.. ఇక తగ్గేదేలే!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా `వీరసింహారెడ్డి`. అంతేకాకుండా అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఎన్.బి.కె 108 వ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నది. ఇక బాలయ్య భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

అయితే బాలయ్య కొన్ని విషయాలకై తనకంటూ కొన్ని విలువలు, హద్దులు పెట్టుకున్నారు. అయితే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ పనులకు దూరంగా ఉంటూ వచ్చిన బాలయ్య ఇప్పుడు మాత్రం అతని నియమాలు కాస్త పక్కకు పెట్టి ఆ పని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ పని ఏంటంటే.. బాలయ్య కెరియర్లో మొదటిసారి యాడ్స్ కు ఓకే చెప్పాడట. అయితే బాలయ్య సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కోసం ఈ యాడ్ చేయబోతున్నాడని సమాచారం.

బాలయ్య నటిస్తున్న తొలి యాడ్ కావడంతో చాలా హై బడ్జెట్ మ‌రియు క్రేజీగా ఉండేట్టు ఈ యాడ్ డిజైన్ చేస్తున్నారని వార్తలు వ‌స‌స్తున్నాయి. ఈ యాడ్ బాలయ్య రేంజ్ కు తగ్గట్టు మంచి రెమ్యూనేషన్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ యాడ్ కు సంబంధించిన ఫోటో మరియు అందులోని లగ్జరీ కార్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ యాడ్ వస్తుందా? అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. వచ్చే సంక్రాంతి పండుగకి తగ్గేదేలే అంటున్న నందమూరి అభిమానులకి ఈ సినిమాతో పండగే పండుగ అని చెప్పచ్చు.

https://twitter.com/vamsikaka/status/1583748176317513729?s=20&t=YnfhQY8F74mtCTrJgoLQ1w