ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు..చెత్తపనులతో చరణ్ కి మండిస్తున్న ఆ స్టార్ డైరెక్టర్.. !?

“కర్మ కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం అయితే పక్క”.. ప్రజెంట్ ఇదే డైలాగ్ ని మెగా పవర్ స్టార్ చరణ్ కి అప్లై చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. దానికి కారణం ఆయన టైం బాగోలేకపోవడమే. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . సినిమాలో తారక్ చరణ్ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ తారక్ కన్నా కూడా చరణ్ పర్ఫామెన్స్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆఫ్ కోర్స్ ఈ విషయంలో అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు .

ఈ సంగతులన్నీ పక్కన పెడితే ప్రజెంట్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పక్క ప్లానింగ్ తో వెళ్లుంటే.. మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ని పూర్తిగా కంప్లీట్ చేసుకునేది. అయితే గతంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 సినిమాను హోల్డ్ లో పెట్టిన శంకర్ ..ఇప్పుడు ఆ సినిమాకు అడ్డు తొలగడంతో ఆ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు .

ఎక్కడ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారో అన్న భయంతో ఋఛ్15 షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తూ..రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే షూటింగ్ సెట్స్ లో శంకర్ ప్రవర్తన సరిగా లేదు అంటూ చరణ్ బాధపడుతున్నారట. అంతేకాదు ఇండియన్ 2 సినిమాపై చేసినంత కాన్సన్ట్రేషన్ ర్చ్15 సినిమాపై శంకర్ చేయట్లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు ఇదే విషయాన్ని డైరెక్ట్ గా శంకర్ కి చిరంజీవి కూడా చెప్పారట . “నా కొడుకు కెరీర్ నీ చేతుల్లో పెట్టాను ..ఈ సినిమాతో అన్యాయం చేయొద్దు.. ఇంకోసారి ఇలా జరిగితే బాగోదు”.. అంటూ వార్న్ కూడా చేశారట . అయినా కానీ శంకర్ తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇండియన్ 2 సినిమా పైనే పెట్టాడని..దీంతో చరణ్ డిసప్పాయింట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి శంకర్ ఏ సినిమాకి న్యాయం చేస్తాడో..ఏ సినిమాని ముంచేస్తాడో..?

Share post:

Latest