ఆ విషయంలో తల్లినే మించిపోయిందిగా..ప్రగతీ ఆంటీ కూతురు రచ్చ మామూలుగా లేదుగా..!?

సోషల్ మీడియా పుణ్యమాంటూ సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీస్ పిల్లల గురించి జనాలకు ఇట్టే తెలిసిపోతుంది . జనరల్ గా ఇప్పటివరకు మనకు స్టార్ హీరోస్, హీరోయిన్స్, స్టార్ డైరెక్టర్. స్టార్ ప్రొడ్యూసర్స్ పిల్లల గురించి మాత్రమే తెలుసు. సినిమాలో చిన్నాచితక పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కడుపు నింపుకుంటున్న నటుల పిల్లల గురించి పెద్దగా తెలియదు కానీ, సోషల్ మీడియా పుణ్యమాంటూ ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పిల్లల గురించి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూతురు ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.

మనకు తెలిసిందే ప్రగతి అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా పాపులర్ అయిందో. నిజానికి ఈమెకు ఇంత పాపులారిటీ కరోనా లాక్ డౌన్ లోనే దక్కింది. అంతకుముందు కూడా ప్రగతి సినిమాలు చేసేది కానీ కరోనా టైం లో ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గర అయింది ప్రగతి . తన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి చేసే వ్యాయామాలు..తాను ఇంట్లో ఎలా ఉంటుందో చేసే ఫన్నీ వీడియోస్ ..ఒకానొక టైం లో అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లెట్ బండి తోలుతూ పోస్ట్ చేసిన వీడియో ఎంతలా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం.

కాగా ఈ మధ్యకాలంలో ప్రగతి బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. పలు ఈవెంట్లలో తలుక్కున మెరిసి తనదైన స్టైల్ లో పెర్ఫార్మన్స్ చేసి మెప్పిస్తుంది . కాగా రీసెంట్గా డాటర్స్ డే సందర్భంగా ప్రగతి తన కూతురు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . దీంతో ప్రగతి కూతురు ఫొటోస్ చూసిన నటిజన్స్ అందం విషయంలో అమ్మని మించిపోయే విధంగా ఉందిగా ఈ పాప అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు నీ తర్వాతే నీ కూతుర్ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి దింపు అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు . కాగా ప్రగతి డాటర్స్ డే సందర్భంగా తన కూతుర్ని దీవిస్తూ ..ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఓ పోస్ట్ పెట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే ప్రగతి కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

 

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)