ఆ ఒక్క కారణంతోనే బెస్ట్ ఫ్రెండ్ ను దూరం పెట్టిన ప్రభాస్..శ్రీను షాకింగ్ కామెంట్స్..!?

మన జీవితంలో ఫ్రెండ్స్ కి ..ఫ్రెండ్షిప్ కి ఉండే వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మ-నాన్న, అక్క-చెల్లెలు , అన్న-తమ్ముడు , పిన్ని-బాబాయ్ ఇలా అందరూ మనకి వరసైనవాళ్లు బంధువులే క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. కానీ బ్లడ్ రిలేషన్ లేకపోయినా కానీ ..మన కోసం ఏమైనా చేసేంత తెగింపు ఉన్న ఏకైక రిలేషన్ ఫ్రెండ్షిప్ . ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాగా సినీ ఇండస్ట్రీలో కూడా అలాంటి ఫ్రెండ్స్ బోలెడు మంది ఉన్నారు. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం. జాన్ జిగిడి దోస్తులు అనే ట్యాగ్ కూడా ఉంది వీళ్ళకి.


ఇక అలాగే బన్నీ-సుకుమార్, ప్రభాస్-గోపీచంద్ ఇలా చాలామంది సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. కానీ మనకు తెలియని కొందరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండి ఇప్పుడు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్లలో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిందే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్రెండ్ శ్రీను గురించి . యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఫిలిం జర్నీ చేసి ప్రభాస్ కి అన్ని తానై చూసుకున్న శ్రీను తన పేరునే ప్రభాస్ శీనుగా మార్చుకొని టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకరుగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ శీను.. ప్రభాస్ నటించిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో నటించి మెప్పించాడు. అంతేకాదు అసలు ఆయన సినీ కెరియర్ స్టార్ట్ అయింది ప్రభాస్ సినిమా తోనే. అంతేకాకుండా ఆయన గతంలో ప్రభాస్ డేట్స్ కూడా చూశాడు. కానీ ఒక సందర్భంలో ప్రభాస్ శ్రీను గురించి ఓ రేంజ్ లో పొగిడేసాడు. శ్రీను లేకపోతే నా సినీ కెరియర్ లేదనే రేంజ్ లో చెప్పుకొచ్చాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ తెరపై కనిపించడం లేదు .

అంతేకాదు పబ్లిక్ ఈవెంట్స్ లో గాని.. పర్సనల్ గా కానీ మీటైన దాఖలాలు లేవు.దీంతో వీళ్లిద్దరూ విడిపోయారు అనే ప్రచారం ఊపు అందుకుంది. అయితే చాలాకాలం తర్వాత ప్రభాస్ ఈయనతో కనిపించడం మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. గతంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శీను మాట్లాడుతూ..” నాకు ప్రభాస్ కు గొడవలు అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నామని.. ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు . నేను నా పర్సనల్ వర్క్ లో బిజీ అయిపోయాను . అంతే తప్పిస్తే మా మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చారు.

అంతే కాదు వైజాగ్ లో సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఇద్దరు కలిసి యాక్టింగ్ నేర్చుకున్నట్లు అప్పటి నుంచి ప్రభాస్ ఆయనకు ఫ్రెండ్ అయినట్లు చెప్పుకొచ్చాడు . అంతేకాదు ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ లో కూడా ఈయన నటించాల్సిందట ..కానీ, కొన్ని సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని మిస్ చేసుకున్నాడట. ప్రభాస్ ఈయనతో చాలా చనువుగా ఉంటాడని కూడా చెప్పుకొచ్చాడు. ప్రభాస్ స్టార్టడమ్ వచ్చినంత మాత్రాన మారిపోయే వ్యక్తి కాదని ప్రభాస్ మనస్తత్వం వేరేదని.. ఆయన చెప్పుకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది”.