ఏంటమ్మ ఆ మాటలు..పవన్ డైరెక్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రెజినా..!?

స్టార్ పొజిషన్లో ఉన్నాక మనం ఏ మాట మాట్లాడినా ఏ ట్వీట్ పెట్టిన ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. నేను స్టార్ సెలబ్రెటీని కదా అంటూ టక్కున టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడితే పొరపాటున ఓ పేరు మర్చిపోతే రచ్చ రచ్చ అయిపోతాది. కానీ ఇక్కడ ఈ హీరోయిన్ చేసిన పనికి స్టార్స్ కూడా షాక్ అయిపోయారు . ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసా..?

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న హరీష్ శంకర్.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, అందాల భామ రెజీనా తో కలిస్ ఫన్నీ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు నిర్మాతలకు హ్యూజ్ లాభాలను తీసుకువచ్చి పెట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడు సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో హరి శంకర్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు . ఈ సినిమాలో నటించిన హీరో సాయిధరమ్ తేజ్ కి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ కి మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కి ధన్యవాదాలు చెప్పుతూ”..ట్వీట్ చేసారు.

అయితే సినిమాలో హీరోయిన్ గా నటించిన రెజినాను మాత్రం మర్చిపోయారు. ఇక్కడ అమ్మడుకు మండింది . దీంతో ట్విట్టర్ వేదికగానే రిప్లై ఇస్తూ” బహుశా మా డైరెక్టర్ కి మిగతా క్యారెక్టర్స్ గుర్తులేవనుకుంటాను.. సీతతో అంత ఈజీ కాదు ” అంటూ సినిమాలోని డైలాగ్స్ చెప్తూ కౌంటర్ ట్వీట్ వేసింది. దీంతో ఇప్పుడు రెజీనా హరిశంకర్ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు పొరపాటున హరీష్ శంకర్ రెజినా పేరు మర్చిపోయి ఉండొచ్చు.. ఏంటమ్మా ఆ ఘాటు మాటలు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . నిజానికి సినిమాలో హీరో పేరు గుర్తు పెట్టుకున్న డైరెక్టర్ కి హీరోయిన్ పేరు గుర్తు ఉండదా అంటూ కొందరు నిందిస్తున్నారు. మరి దీనికి హరీష్ శంకర్ సమాధానం చెప్తారంటారా వేచి చూడాల్సిందే..!!