బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు..వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోక్షజ్ఞ..!?

గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా వేడి పుట్టిస్తున్నాయో తెలిసిందే. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యేలా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మార్చాలని సంచలన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆయన నిర్ణయాని తప్పుపడుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై తీవ్ర దుమారం రేపుతుంది. ఇక ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల ఎంతోమంది తెలుగుదేశం నేతలు, నందమూరి అభిమానులు. నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జగన్ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నాడు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష… కూడా తన తండ్రి పేరుని మార్చడం పై ఘాతుగానే స్పందించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ చేసిన ట్వీట్ పై వైసిపి నేత మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. “టిడిపి హయాంలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కట్టలేకపోయినా హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరును ఎలా పెట్టుకున్నారంటూ” వ్యంగ్యంగా ప్రశ్నించారు.

దీంతో నందమూరి అభిమానులు ఆయనపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.” నువ్వు ఎన్ని మాట్లాడిన బాలకృష్ణ వెంట్రుక కూడా పీకలేవు.. ఆయన కాళ్ల గోటికి కూడా నువ్వు సమానం కాదు” అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరును మార్చడంపై మోక్షజ్ఞ కూడా తనదైన స్టైల్ లో స్పందిస్తూ ట్వీట్ చేసారు. వైసిపి నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు . బాలయ్య గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వైసిపి నేతలకు పరోక్షంగా మోక్షజ్ఞ ఘాటుగా కౌంటర్ వేశారు.” అవసరం ఉన్నప్పుడు అందరు ఆయన కాళ్ల దగ్గరికి వచ్చారు.. అవసరం తీరిపోగానే కారు కూతలు కూస్తున్నారు .. అలాంటి వాళ్లకి కాలమే సమాధానం చెబుతుంది “అంటూ తన తండ్రికి సపోర్టుగా నిలబడ్డాడు మోక్షజ్ఞ. దీంతో ఏపీ రాజకీయాల్లో మోక్షజ్ఞ పేరు కూడా హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.