బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా అయిపోయడు. ఈయన నటించిన రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపొయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా లో నటిస్తున్నడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమా కూడా చేస్తున్నడు.
ఈ సినిమాలు తర్వాత ప్రభాస్ అర్జున్ రేడ్డి డైరక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నడు. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ పెంచుకోవడం కోసం ఎక్కువ శాతం అయన సినిమాలలో బాలీవుడ్ కి సంబంధించిన నటులనే తీసుకుంటున్నాడు. ఇప్పటికే సాహో, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలలో బాలీవుడ్ నటిమణులు తో నటిస్తున్నడు.
అ సినిమాలు పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ నటి కరీనాకపూర్ నటిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎలాంటి ఆధికారిక ప్రకాటన లేకపోయిన పెద్ద ఎత్తున ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో కరీనాకపూర్ ప్రభాస్ స్పిరిట్ సినిమాపై క్లారిటి ఇచ్చింది.
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మీరు నటిస్తున్నర…? అన్న ప్రశ్నాకు కరీనా… “ప్రభాస్ తో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అని.. కానీ ఇప్పటి వరకు అలాంటి ఛాన్స్ రాలేదని.. ఇప్పటి వరకు ఎవరు ప్రభాస్ సినిమా కోసం తనను అప్రోచ్ అవ్వలేదని కరీనా కపూర్ క్లారిటి ఇచ్చింది”. మొత్తానికి ప్రభాస్ సినిమా హీరోయిన్ విషయంలో ఒక క్లారిటి అయితే వచ్చింది. కరీనా కపూర్ నోచెప్పడంతో మరో హీరోయిన్ పేరు ఏమైనా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో షూటింగ్ ప్రారంభిస్తారు.. కనుక హీరోయిన్ పై ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చేఅవకాశం లేదు. ఈ లోపు ఎంత మంది పేర్లు మనం ఈ సినిమాలో హీరోయిన్ అంటూ వినాల్సి వస్తుందో.