ప్రైవేట్ ప్లేస్ లో నిహారిక సీక్రెట్ టాటూ.. ఆ బొమ్మ ఎవరిదో తెలుసా..?

మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే అమ్మడు.. పెళ్లి తరువాత మరీ రెచ్చిపోయి పోస్ట్లు చేస్తుంది. అంతేకాదు ఆ మధ్య నిహారిక మీద విపరీతంగా ట్రోల్స్ కూడా జరిగాయి. ఇక నిహారిక పబ్బులో దొరకడం. డ్రగ్స్ వాడిందంటూ, భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు బయటికి రావడంతో మెగా డాటర్ పరువు సోషల్ మీడియాలో కలిసిపోయింది. ఫైనల్లీ భర్త చైతన్యతో విడిపోయారు అన్నది రూమర్ గానే నిలిచింది.

 

నిహారిక తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. అయితే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే ఆకట్టుకునేలా చేసిన కారణంగా ఫ్లాప్ అయింది. అయినా కానీ నిహారిక లోని జోరు మాత్రం తగ్గలేదు. కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత నిహారిక పెళ్లి జరిగింది. నిహారిక పెళ్లి తర్వాత మరింత దూకుడుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్త చైతన్యాన్ని కూడా తనతో పాటే తిప్పేస్తూ.. ఇద్దరు కలిసి వర్క్ అవుట్ లు చేస్తూ… ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే తాజాగా నిహారిక ఓ రీల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అందులో తన వీపు భాగంలో ఉన్న ఓ టాటూ ‌ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఆ టాటూ ని చూస్తుంటే అది నాగబాబు ముఖచిత్రంలా అనిపిస్తోంది. అయితే ఇంతకీ ఆ బొమ్మ ఎవరిది? ఆ టాటూ మీనింగ్ ఏంటి? అన్నది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ టాటూ మీనింగ్ ఏంటి అన్నది నిహారికనే చెప్పాల్సి ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే కదా సెలబ్రిటీలకి టాటూల పిచ్చి ఉంటుందని అదే నిహారిక విషయంలో కూడా జరిగినది.