ఊహించని షాక్ ఇచ్చిన అనుష్క.. తెలంగాణ అబ్బాయి తో పెళ్లి ఫిక్స్ అయిపోయిందోచ్..!?

అనుష్క శెట్టి ఈ పేరు గురించి కొత్తగా చెప్పాలా…చెప్పండి. అనుష్క టాలీవుడ్ లోకి సూపర్ అనే సినిమా తో హీరోయిన్ గా వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇక అప్పటినుండి వరుసుగా స్టార్ హీరోల సరసన సినిమాల్లో నటించింది. అనుష్క టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్ గా నటించింది. అనుష్క ఓవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తన సత్తా చాటింది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక ఆ పై వచ్చిన బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు అనుష్క కెరీర్ కు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక ఇటీవల పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాలో నటించింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అనుష్క ఈమధ్య కెరీర్ కు బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అయితే, ఈ మధ్యనే నవీన్ పొలిశెట్టి తో ఓ సినిమాకి కమిట్ అయ్యి..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

అయితేం , త్వరలోనే స్వీటీ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె అతి త్వరలోనే పెళ్లి పీఠ ఎక్కబోతున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఇందులో భాగంగానే తాజాగా అనుష్క శెట్టి మ్యారేజ్ గురించి హాట్ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది. అనుష్క త్వరలోనే వివాహం చేసుకోబోతుందట.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న అనుష్క తెలంగాణకు చెందిన ఓ బడా వ్యాపారవేత్త తో పెళ్లికి రెడీ అయిందట. త్వరలోనే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేయాలని ఇరు కుటుంబ స‌భ్యులు నిర్ణయించుకున్నారని సమాచారం. అంతేకాదు వచ్చే ఏడాది ప్రారంభంలో అనుష్క పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక అనుష్క పెళ్లి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.