దుల్కర్ సల్మాన్ మొదటి సంపాదన ఏం చేసి సంపాదించాడో తెలుసా.. ఆ డబ్బుతో ఏం చేశారంటే..?

దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ లో నటించిన పాన్ ఇండియా సినిమా సీతారామం. ఈ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ కేవలం మలయాళం లోనే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరయ్యారు. ఇక తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ఆయన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

సీతారామం సినిమాలో రామ్ పాత్రతో ప్రేక్షకులను బాగా మెప్పించి దుల్కర్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇకపోతే సీతారామం సినిమా ధియేటర్లో 50 రోజులు సక్సెస్ గా పూర్తి చేసుకున్న తరుణంలో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన మొదటి రెమ్యునరేషన్ 2000 రూపాయలు అని చెప్పారు. ఇక అది ఆయన పది సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో రాజీవ్ మినన్ యాడ్ ఏజెన్సీ వాళ్ళు వారి పాఠశాలకు వచ్చారట. ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళు దుల్కర్ సల్మాన్ ని కూడా ఎంపిక చేశారట. యాడ్ ఏజెన్సీ వాళ్ళు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఆయనకి ఇచ్చారట. ఇక అప్పట్లో 2000 రూపాయలు అంటే ఆయనకి రెండు కోట్లతో సమానమని దుల్కర్ సల్మాన్ తెలిపారు.

ఇక ఆ 2000 రూపాయలలో 500 రూపాయలు వారి అమ్మమ్మ తాతయ్యలకు ఇచ్చారట.. మిగతా డబ్బులను వారి అమ్మకు ఇచ్చారని తెలిపారు. దీంతో దుల్కర్ సల్మాన్ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయన మొదటి పారితోషకం సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అంతే కాకుండా ఆయన బయటకు వెళ్లిన ప్రతిసారి వాళ్ళ అమ్మను తాతను ఇచ్చిన డబ్బులతో ఏదైనా కొనిపెట్టమని అడిగేవారట . ఇక వారి అమ్మగారు అవి ఎప్పుడో ఖర్చయిపోయాయని సరదాగా ఆటపట్టించే వారట. అలా వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు దుల్క‌ర్ సల్మాన్.