సంయుక్తా మీనన్ కు ఇదేం పోయే కాలం..విడాకులు తీసుకున్న హీరోతో అలాంటి పనులా.!?

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ..ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాకుండా తయారయింది. లేకపోతే చూడ చక్కగా ఉన్న ఈ మలయాళ బ్యూటీ పెళ్లి అయి బిడ్డలు ఉన్నా హీరో తో ప్రేమాయణం నడపడం ఏంటి..? ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఇదే విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా తయారయింది. మనకు తెలిసిందే సంయుక్త మీనన్ మలయాళ నటి. మలయాళం లో తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు తెలుగులోనూ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా.

ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్తా మీనన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన రానాకు భార్యగా సంయుక్త మీనన్ సైలెంట్ క్యారెక్టర్ లో అందరిని ఆకట్టుకుంది. నిజానికి సంయుక్త పాత్ర ఈ సినిమాలో చాలా చిన్నది కానీ ఎక్కడ ఎలా వాడుకోవాలో అక్కడ అలా వాడుకొని డైరెక్టర్ సంయుక్తను హైలెట్ చేశారు . దీంతో సంయుక్తా మీనన్ పేరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ రేంజ్ లో మారు మ్రోగిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన బింబిసారాలో కూడా సంయుక్త తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ తెలుగులో సంయుక్త మీనన్ అవకాశాలు అందుకోలేక పోతుంది

అయితే తమిళ్ హీరో ధనుష్ తో సంయుక్త మీనన్ లవ్ అఫైర్ నడుపుతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. సంయుక్త మీనన్ ధనుష్ తో కలిసి సార్ అనే సినిమాలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య చనువు పెరిగి అది ప్రేమకు దారి తీసింది అని కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . అంతేకాదు సంయుక్త మీనన్ ధనుష్ ఇద్దరు కలిసి టూర్లు కూడా తిరుగుతున్నారని డిన్నర్ పార్టీలకు వెళ్తున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో సంయుక్త మలయాళీ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. విడాకులు తీసుకున్న హీరోతో నీకు పెళ్లి అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. మరి చూడాలి దీనిపై సంయుక్త ఏ విధంగా స్పందిస్తుందో..?