అచ్చ తెలుగు బ్యూటీ.. అన్నీ విప్పినా చూసేవారే లేరుగా!

సినిమా ఇండస్ట్రీలో నేను ఇలానే ఉంటాను అంటే కుదరనే కుదరదని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఈ మాట ఎందుకో అచ్చొస్తుంది. అలాంటి కొద్ది వారిలో అచ్చ తెలుగు బ్యూటీ అంజలి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎక్స్‌పోజింగ్ అంటే నో అనేసినా, వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి ఈ అమ్మడికి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చాలా లేటుగా అర్థం చేసుకుంది ఈ బ్యూటీ. కేవలం నటనతోనే నెట్టుకురావడం ఇప్పట్లో కష్టమని అర్థం చేసుకుంది. తెలుగులో అరకొర సినిమాలే చేసినా, తమిళనాట మంచి సినిమాలు చేసిన గ్రాఫ్ ఈ బ్యూటీ సొంతం.

అయితే ఇప్పుడు అక్కడ కూడా ఈ అమ్మడు ఔట్ డేటెడ్ కావడంతో, తిరిగి తెలుగు సినిమాలపై మనసు మల్లిందట. అయితే ఇక్కడ హీరోయిన్‌గా మాత్రం అమ్మడికి అవకాశాలు రావనే చెప్పాలి. దీంతో ఏ ఆఫర్ వస్తే అది చేసేందుకు రెడీ అంటోంది ఈ బ్యూటీ. అంతేగాక.. ఎక్స్‌పోజింగ్ కూడా చేసేందుకు సై అంటోంది ఈ భామ. ఇప్పటికే ఐటెం సాంగ్స్ చేస్తూ అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కించాలని చూస్తోన్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరింత స్లిమ్‌గా మారి, హాట్ అందాల ఆరబోతతో ఫోటోషూట్‌లు చేస్తోంది.

ఈ ఫోటోషూట్‌లతో నిర్మాతల్లో వేడి పుట్టించి ఆఫర్లు పట్టేయాలని ప్లాన్ వేస్తోంది. కానీ అమ్మడికి ఇంకా ఎలాంటి ఆఫర్లు మాత్రం పడటం లేదు. దీంతో అన్నీ విప్పినా చూసే వారు లేరంటూ బోరుమంటోంది అంజలి. మరి మన తెలుగు దర్శకనిర్మాతల్లో ఎవరైనా అమ్మడిని కన్సిడర్ చేసి మంచి పాత్రలు ఇస్తారా.. లేక కేవలం ఐటెం సాంగ్స్‌కే బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేస్తారా అనేది చూడాలి.