సలార్ వచ్చేస్తున్నాడు.. ఇక విధ్వంసానికి సిద్ధంగా ఉండండి..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ అప్డేట్ మాత్రమే ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే సలార్ సినిమా నుండి మరో అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో సినీ వర్గాల్లో ఓ అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది.

సలార్ చిత్రం నుండి త్వరలోనే ప్రభాస్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. అయితే ఈ అప్ డేట్ సినిమా టీజర్ గురించా లేక వేరే ఏదైనా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో విశేషమేమిటంటే.. ఈ అప్డేట్ ను ఆగస్టులోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇండిపెండెన్స్ డే కానుకగా సలార్ నుండి సర్ ప్రైజ్ అప్డేట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటోంది చిత్ర యూనిట్. అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోండగా, ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. మరి డార్లింగ్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్ కోసం రెడీగా ఉండడమ్మ!